బొత్స ఆంధ్ర బిత్తిరి సత్తి.. ఆయన ఎక్కడుంటే అక్కడ అరిష్టమే: కూన రవికుమార్

23-12-2019 Mon 13:45
  • ఉత్తరాంధ్ర అంటే విశాఖ మాత్రమే కాదు
  • సెక్రటేరియట్ ను శ్రీకాకుళం-ఆముదాలవలస మధ్యలో కట్టండి
  • అసెంబ్లీ సాక్షిగా తమ్మినేని అబద్ధాలు మాట్లాడుతున్నారు

మూడు రాజధానులు పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు తలల రావణాసురుడని మండిపడ్డారు. తమకు కావాల్సింది పరిపాలన వికేంద్రీకరణ కాదని... అభివృద్ధి, ఆర్థిక వికేంద్రీకరణ అని అన్నారు. ఉత్తరాంధ్ర అంటే విశాఖ మాత్రమే కాదని... రాజధానులను తరలించాలనుకుంటే సెక్రటేరియట్ ను శ్రీకాకుళం-ఆముదాలవలస మధ్యలో నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి బొత్సలపై కూన రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. బొత్స ఆంధ్ర బిత్తిరి సత్తి అని వ్యాఖ్యానించారు. బొత్స ఎక్కడుంటే అక్కడ అరిష్టమేనని అన్నారు. ప్రజలను మోసం చేస్తే గుడ్డలూడదీసి కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.