'సరిలేరు నీకెవ్వరు'పై విజయశాంతి ఫేస్ బుక్ పోస్ట్!

23-12-2019 Mon 11:45
  • చాలాకాలం తరువాత సినిమాలో నటిస్తున్న విజయశాంతి
  • టైటిల్ నంబర్ నేడు విడుదల
  • జనవరి 5న ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానం

ఒకప్పుడు అందాల హీరోయిన్ గా, ఆపై లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న విజయశాంతి, చాలా కాలం తరువాత మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా అది వైరల్ అవుతోంది. తాజాగా, తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి, ఓ పోస్ట్ ను పెట్టారు.

"మనం భారతీయులం
'సరిలేరు మనకెవ్వరు'
సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..
ఇది మన దేశం నేర్పిన విధానం
ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, ఈ సందర్భంగా మన సినిమాను అభిమానంతో స్వాగతిస్తున్న ప్రజలకు, అభిమానులకు గౌరవ అతిథులకు ధన్యవాదాలతో...
మీ
విజయశాంతి" అని పోస్ట్ పెట్టారు.