Akash Puri: 'రొమాంటిక్' కోసం తక్కువ పారితోషికం తీసుకున్న రమ్యకృష్ణ

  • విడుదలకి ముస్తాబవుతున్న 'రొమాంటిక్'
  • పూరి సొంత బ్యానర్లో రూపొందుతున్న సినిమా 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

ఈ మధ్య కాలంలో చాలా మంది సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టారు. అయితే వాళ్లందరిలో కంటే ముందుగా దూసుకుపోతున్న నటిగా రమ్యకృష్ణ కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమెకి దక్కిన పాత్రలు .. అవి తెచ్చుకున్న గుర్తింపు ఆమె మార్కెట్ ను మరింతగా పెంచేశాయి.

దాంతో ఆమె ఒక్కో సినిమాకి రోజుకి 10 నుంచి 15 లక్షలు ఛార్జ్ చేస్తోందట. అయితే 'రొమాంటిక్' సినిమాకి 20 రోజులు కేటాయించినప్పటికీ ఆమె 50 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. కృష్ణవంశీకి, పూరికి మధ్యగల స్నేహం, చార్మీతో తనకి గల స్నేహం కారణంగానే ఆమె ఇంత తక్కువ పారితోషికం తీసుకుందని అంటున్నారు. ఇక 'ఫైటర్' సినిమాలోనూ రమ్యకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News