Nanjundan: అనుమానాస్పద స్థితిలో మరణించిన సాహిత్య అకాడమీ అవార్డు విజేత నంజుండన్!

  • బెంగళూరు వర్శిటీలో పని చేస్తున్న నంజుండన్
  • గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరు 
  • చూసేందుకు అసిస్టెంట్ వెళ్లడంతో విషయం వెలుగులోకి

సాహిత్య అకాడమీ అవార్డు విజేత, ప్రముఖ అనువాద సాహిత్యవేత్త డాక్టర్ జి.నంజుండన్, తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. ఆయన గుండెపోటుతో నాలుగు రోజుల క్రితమే మరణించి వుండవచ్చని భావిస్తున్న పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆయన ఎలా మరణించారన్న విషయాన్ని ఎంక్వయిరీ తరువాత వెల్లడిస్తామని తెలిపారు.

కాగా, బెంగళూరులోని నాగదేవనహల్లిలో ఉన్న నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో నంజుండన్ మృతదేహం కనిపించింది. బెంగళూరు వర్శిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్ గా పని చేస్తున్న ఆయన, గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరు కాగా, ఓ అసిస్టెంట్ చూసేందుకు రాగా, విషయం బయటపడింది. దాదాపు 12 పుస్తకాలను కన్నడ నుంచి తమిళంలోకి అనువదించిన ఆయన, కన్నడ మహిళా రచయితలు రాసిన కథలను 'అకా' పేరిట తమిళంలోకి అనువదించినందుకు 2012లో సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

More Telugu News