Jharkhand: ఝార్ఖండ్ లో ఓటమి దిశగా సీఎం రఘుబర్ దాస్... హంగ్ వైపు ప్రజల మొగ్గు!

  • ఏ పార్టీకీ మెజారిటీ ఇవ్వని ప్రజలు
  • బీజేపీ, జేఎంఎం పోటాపోటీ
  • కింగ్ మేకర్ గా అవతరించనున్న కాంగ్రెస్

ఝార్ఖండ్ ప్రజలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీని ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, బీజేపీ, జేఎంఎంలు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుండగా, కాంగ్రెస్ కింగ్ మేకర్ గా అవతరించేలా ట్రెండ్స్ వస్తున్నాయి. మొత్తం 81 సీట్లున్న అసెంబ్లీలో 72 స్థానాల్లో రెండు నుంచి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, బీజేపీ 24, జేఎంఎం 23, కాంగ్రెస్ 9, ఎస్జేఎస్యూ 6, ఆర్జేడీ 2, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జమ్ షడ్ పూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి దిశగా సాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కన్నా 7 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారని తెలుస్తోంది.

More Telugu News