మీ పిల్లలకు పెయిన్ కిల్లర్లు ఇస్తున్నారా.. అయితే జర భద్రం!

23-12-2019 Mon 09:08
  • అధిక మోతాదులో వాడితే విషపూరితం
  • చిన్నారుల్లో తీవ్ర ప్రభావం చూపనున్న ఓపియాడ్
  • తాజా పరిశోధనలో వెల్లడి

నొప్పి అనగానే మీ పిల్లలకు పెయిన్ కిల్లర్లు ఇచ్చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. పిల్లలకు చీటికీమాటికి ఇచ్చే పెయిన్ కిల్లర్లు శరీరంలో విషపూరితంగా మారి హాని చేస్తాయని అంటున్నారు అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు. పెయిన్ కిల్లర్లు అధిక మోతాదులో తీసుకుంటే అవి విషపూరితం అవుతాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు చెప్పారు. చిన్నారుల్లో ఓపియాడ్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుందని తేలిందని అధ్యయనకారులు తెలిపారు. అదే పనిగా పెయిన్ కిల్లర్లు వాడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పెరుగుతున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు.