సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-12-2019 Mon 07:17
  • అనుపమకు మరో ఛాన్స్ 
  • డబ్బింగ్ లో బన్నీ బిజీ 
  • మారుతి తదుపరి సినిమా

  *  ఆమధ్య 'రాక్షసుడు' చిత్రంలో హీరోయిన్ గా నటించిన అందాలభామ అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ నుంచి మరో ఛాన్స్ వచ్చింది. నిఖిల్ హీరోగా రూపొందే 'కార్తికేయ 2' చిత్రంలో కథానాయిక పాత్రకు అనుపమను ఎంచుకున్నట్టు సమాచారం.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న 'అల వైకుంఠపురములో' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఓపక్క హీరో బన్నీ డబ్బింగ్ చెబుతుండగా, మరోపక్క ఇతర ఆర్టిస్టులు కూడా ఆయా పాత్రలకు డబ్బింగ్  చెబుతున్నారు. జనవరి 2న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
*  తాజాగా 'ప్రతిరోజూ పండగే' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాడు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.