ముంబయిలో భారీ అగ్నిప్రమాదం... ఉవ్వెత్తున చెలరేగిన మంటలు!

22-12-2019 Sun 21:59
  • విలేపార్లేలో ఓ భవంతిలో అగ్నికీలలు
  • ఏడో ఫ్లోర్ లో మొదలైన మంటలు
  • 10 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

ముంబయిలోని విలేపార్లే ప్రాంతంలో 13 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లాభ్ శ్రీవల్లి అనే భవనంలో ఏడో ఫ్లోర్ లో మొదలైన అగ్నికీలలు శరవేగంగా ఇతర అంతస్తులకు విస్తరించాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా నలుగురిని రక్షించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.