చిరంజీవి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి: వర్ల రామయ్య

22-12-2019 Sun 21:19
  • మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు
  • తప్పుబట్టిన వర్ల రామయ్య
  • చిరంజీవి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శలు

ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు మెగాస్టార్ చిరంజవి మద్దతు పలకడాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. చిరంజీవి అన్ని విషయాలు తెలుసుకున్నాక ప్రకటన చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. చిరంజీవి వ్యాఖ్యలను అవగాహన లేని రాజకీయనేత చేసిన వ్యాఖ్యల్లా చూడాలా? పరిపక్వత లేని పౌరుడు, సినిమా నటుడు చేసిన వ్యాఖ్యల్లా తీసుకోవాలా? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. చిరంజీవి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు.