రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన వరల్డ్ రికార్డు

22-12-2019 Sun 20:25
  • ఓ సీజన్ లో అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ కైవసం
  • ఈ క్యాలెండర్ ఇయర్ లో 2442 పరుగులు సాధించిన రోహిత్
  • జయసూర్య రికార్డు తిరగరాసిన హిట్ మ్యాన్

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడమే కాదు, ఏకంగా ప్రపంచ రికార్డును తిరగరాశాడు. క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. విండీస్ తో కటక్ వన్డేలో రోహిత్ 63 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా ఈ సీజన్ లో మొత్తం 2442 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుముందు శ్రీలంక విధ్వంసక ఆటగాడు సనత్ జయసూర్య పేరిట ఉంది. ఎడమచేతివాటం ఆటగాడు జయసూర్య 1997 సీజన్ లో 2,387 పరుగులు సాధించాడు.