ఇకపై హైదరాబాద్ ‘మెట్రో’లో క్యూఆర్ కోడ్ తో ప్రయాణం చేయొచ్చు

22-12-2019 Sun 19:54
  • మెట్రో రైలు ప్రయాణీకులకు శుభవార్త
  • ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసి క్యూఆర్ కోడ్ తో ప్రయాణం
  • రేపు హైటెక్ సిటీ స్టేషన్ లో ప్రారంభం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులకు శుభవార్త. ఇకపై క్యూఆర్ కోడ్ తో ప్రయాణం చేసే అవకాశాన్ని ‘మెట్రో’ కల్పించనుంది. ఇందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ టికెట్ విధానాన్ని రేపు హైటెక్ సిటీ స్టేషన్ లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి  ప్రారంభించనున్నారు. ఈ విధానం ద్వారా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుని క్యూఆర్ కోడ్ తో ‘మెట్రో’లో ప్రయాణం చేయవచ్చు. ‘మెట్రో’ రైల్ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ విధానాన్ని హెచ్ఎంఆర్ అధికారులు అమలు చేయనున్నారు.