రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారు: కన్నా లక్ష్మీనారాయణ

22-12-2019 Sun 19:12
  • రాజధాని ఇక్కడే ఉంచుతామని నాడు జగన్ చెప్పారు
  • ఇప్పుడేమో ఇలాంటి ఆలోచన చేస్తారా?
  • ఈ పిచ్చి నిర్ణయాలను పక్కనబెట్టాలి

రాజధానిని అమరావతిలోనే ఉంచుతామని నాడు ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారని, ఇప్పుడేమో ఇలాంటి ఆలోచన చేయడమంటే రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే అవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిందే కానీ, ఈ పద్ధతిలో కాదని అన్నారు.

ఏ రాష్ట్రానికి అయినా మంచి రాజధాని అవసరం, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, ఇప్పటివరకు సూచించారు. అమరావతిలో దాదాపు పది వేల కోట్ల వరకు ఖర్చు అయిందని అన్నారు. తనకు తెలిసినంత వరకూ చాలా నిర్మాణలకు ఫౌండేషన్స్ అయిపోయినట్టు చెప్పారు. ఈ పిచ్చి నిర్ణయాలను పక్కనబెట్టాలని మరోమారు పునరాలోచించాలని సూచించారు.