వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ట్రాప్ లో ఉంది: సోము వీర్రాజు

22-12-2019 Sun 18:44
  • రాజధాని అంశంపై బీజేపీ నేత వ్యాఖ్యలు
  • రాజధాని సంగతి వదిలేయాలని హితవు
  • రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచన

రాజధాని ఆధారంగా అభివృద్ధి జరుగుతుందా? అంటూ బీజేపీ నేత సోము వీర్రాజు వైసీపీ నేతలను ప్రశ్నించారు. రాజధాని సంగతి వదిలేసి రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోవాలని హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు లేచినప్పటినుంచి రాజధాని గురించే మాట్లాడతారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు ఉచ్చులో పడిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ఏమి చేస్తుందో బ్లూప్రింట్ కావాలని డిమాండ్ చేశారు. నిబద్ధత కోసమే వైసీపీకి 151 సీట్లు ఇచ్చారని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.