Narendra Modi: ఇవాళ ఆందోళన చేస్తున్నవారిలో ఎక్కువమంది చొరబాటుదారులే: మోదీ ఆరోపణలు

  • పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ప్రధాని స్పందన
  • కాంగ్రెస్ హయాంలోనే ఎన్నార్సీ వచ్చిందని వెల్లడి
  • ఇక్కడున్నది మోదీ అంటూ ధీమా

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెల్లుబుకుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇవాళ ఆందోళన చేస్తున్నవారిలో అత్యధికులు చొరబాటుదారులేనని ఆరోపించారు. చొరబాటుదారులు తమ గుర్తింపు చూపించరని, శరణార్ధులు తమ గుర్తింపును దాచిపెట్టరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలోనే ఎన్నార్సీ వచ్చిందని, యాజమాన్య హక్కులు కల్పించేందుకే పౌరసత్వ చట్టం తెచ్చామని మోదీ స్పష్టం చేశారు. ఎన్సార్సీపై కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, పట్టణ నక్సలైట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపిస్తారంటూ భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని క్షుణ్ణంగా చదవాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు ఏ పార్టీ తీసుకోని నిర్ణయాన్ని బీజేపీ తీసుకుందని, బీజేపీ నిర్ణయంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని మోదీ విమర్శించారు. మీ అందరికీ తెలుసు ఇక్కడున్నది మోదీ, అనుకున్నది సాధిస్తాడు అంటూ ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో తన పేరిట జరిగిన కృతజ్ఞత సభలో మోదీ పాల్గొన్నారు.

More Telugu News