CPM: జీఎన్ రావు కమిటీ నివేదికపై సీఎం లీకులు ఇవ్వడం కాదు బహిర్గతం చేయాలి: రాఘవులు డిమాండ్

  • గుంటూరులో మీడియాతో మాట్లాడిన రాఘవులు
  • అఖిలపక్షం వేయాలని సూచన
  • అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న వామపక్ష నేత

ఏపీ సర్కారు చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పందించారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం కాకుండా అందులోని పూర్తి అంశాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అఖిలపక్షం వేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. రాజధాని అంశాన్ని ప్రజాకోణం నుంచి చూడాల్సిన అవసరం ఉందని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అన్నారు. అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. పాలనాపరమైన సమస్యలు కూడా వస్తాయని పేర్కొన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

More Telugu News