Shashi Tharoor: 30 ఏళ్ల కిందట రాసిన పుస్తకం విషయంలో శశిథరూర్ పై అరెస్ట్ వారెంట్

  • ది గ్రేట్ ఇండియన్ నావెల్ పుస్తకం రాసిన థరూర్
  • నాయర్ వర్గ మహిళలను కించపరిచాడంటూ ఫిర్యాదు
  • శనివారం విచారణ
  • నోటీసుల్లో తేదీ పేర్కొనలేదన్న థరూర్ కార్యాలయం

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చిక్కుల్లో పడ్డారు. ఎప్పుడో మూడు దశాబ్దాల కిందట రాసిన ఓ పుస్తకం వివాదంలో ఆయనపై తిరువనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 30 ఏళ్ల క్రితం శశి థరూర్ ది గ్రేట్ ఇండియన్ నావెల్ పేరిట పుస్తకం రాశారు. అందులో నాయర్ వర్గ మహిళలను కించపరిచేలా రాశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఫిర్యాదు నమోదు కాగా, విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాలేదంటూ న్యాయమూర్తి థరూర్ పై వారెంట్ జారీ చేశారు. శనివారమే ఈ కేసు విచారణకు వచ్చింది.

దీనిపై శశి థరూర్ కార్యాలయ వర్గాలు స్పందించాయి. విచారణకు రావాలంటూ పంపిన నోటీసుల్లో కేవలం సమయం ఇచ్చారే తప్ప, తేదీ పొందుపరచలేదని తెలిపాయి. ఇదే విషయం కోర్టుకు తెలిపితే తాజాగా తేదీతో సహా మళ్లీ సమన్లు పంపిస్తామని తెలిపిందని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి సమన్లు అందలేదని థరూర్ కార్యాలయం పేర్కొంది. దీనిపై తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ను సంప్రదిస్తామని వెల్లడించింది.

More Telugu News