విజృంభించిన సైనీ... కష్టాల్లో విండీస్

22-12-2019 Sun 16:02
  • కటక్ లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య చివరి వన్డే
  • చేజ్, హెట్మెయర్ లను అవుట్ చేసిన సైనీ
  • నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్

కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కటక్ లో నిప్పులు చెరుగుతున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సైనీ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి టీమిండియాలో ఉత్సాహం నింపాడు. క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు దిశగా సాగిపోతున్న రోస్టన్ చేజ్ (38), షిమ్రోన్ హెట్మెయర్ (37)లను అవుట్ చేసిన సైనీ వెస్టిండీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 33 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు. నికోలాస్ పూరన్, కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నారు.