'అల వైకుంఠపురములో' నుంచి మరో సాంగ్... సూపర్ హిట్టేనని ప్రామిస్!

22-12-2019 Sun 12:49
  • సాంగ్ టీజర్ విడుదల 
  • బుట్టబొమ్మా బుట్టబొమ్మా అంటూ సాగే పాట
  • జనవరి 12న విడుదల కానున్న సినిమా

అల్లు అర్జున్, పూజా హెగ్డే నటిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న 'అల వైకుంఠపురములో' నుంచి మరో సాంగ్ టీజర్ విడుదలైంది. గీతా ఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా సాంగ్ ప్రోమో విడుదల కాగా, పూర్తి పాట 24న విడుదల కానుంది. ఇప్పటికే సినిమాలోని 'సామజవరగమన', 'రాములో రాములా', 'ఓ మైగాడ్ డాడీ' పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక కొత్త సాంగ్ టీజర్ ను షేర్ చేసిన హీరోయిన్ పూజా హెగ్డే, ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ సినిమాలో తనకు నచ్చిన పాటను ఎంచుకోమంటే చాలా కష్టమని వ్యాఖ్యానించింది. కాగా, ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన 'బుట్టబొమ్మా బుట్టబొమ్మా... నన్ను సుట్టుకొంటివే' అన్న సాంగ్ టీజర్ ను మీరూ చూడవచ్చు.