ఏపీ రాజధాని విషయాన్ని రాష్ట్ర మంత్రులు అవహేళన చేశారు: కొల్లు రవీంద్ర

22-12-2019 Sun 12:46
  • రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేశారు
  • ఏదో ఒక వంకతో రాజధానిని తరలించాలనుకుంటున్నారు
  • ఇదే జగన్ ఉద్దేశం
  • మూడు రాజధానుల వల్ల పరిపాలన చాలా కష్టం

రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన మనసు రైతులదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీ రాజధాని విషయాన్ని రాష్ట్ర మంత్రులు అవహేళన చేశారని ఆయన విమర్శించారు.

ఏదో ఒక వంకతో అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్నదే జగన్ ఉద్దేశమని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల వల్ల పరిపాలన చాలా కష్టమవుతోందని అన్నారు. ఒకవేళ రాయలసీమ ప్రజలు సచివాలయానికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. జీఎన్ రావు కమిటీ అంటే జగన్ కమిటీయేనని ఆరోపించారు.