బ్రేకింగ్ న్యూస్... ఏపీ ఎక్స్ ప్రెస్ బీ-1 బోగీలో మంటలు!

22-12-2019 Sun 11:46
  • న్యూఢిల్లీ నుంచి విశాఖకు రైలు
  • బ్రేక్ పట్టేయడంతో మంటలు
  • పరుగులు తీసిన ప్రయాణికులు

న్యూఢిల్లీ నుంచి విశాఖకు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం రైలు ప్రయాణిస్తుండగా, బ్రేక్ పట్టేయడంతో ఏసీ కోచ్ బీ-1లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది రైలును వెంటనే నిలిపివేశారు. ఆపై ప్రాణభయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆపై మంటలను అదుపు చేశారు. ప్రయాణికులకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే భద్రతా సిబ్బంది, అధికారులు ఘటనా స్థలికి పరుగులు పెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.