sunnileone: వేధించే వారికి గుణపాఠం చెప్పండి : బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్

  • ముఖ్యంగా పని ప్రదేశంలో స్ట్రిక్ట్ గా ఉండాలి 
  • మౌనంగా ఉంటే మరింత ప్రమాదకరం 
  • ఫేస్ బుక్ లో వీడియో పోస్టింగ్

వేధించే వారికి తక్షణం గుణపాఠం చెప్పాలని, మౌనంగా ఉంటే మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చునని సినీనటి సన్నీలియోన్ తోటి మహిళలను హెచ్చరించారు. ముఖ్యంగా పని ప్రదేశంలో వేధింపులు ఎదురైతే అస్సలు ఉపేక్షించవద్దని సూచించారు. ఒకప్పుడు పోర్న్ స్టార్...తాజాగా బాలీవుడ్ లో తన స్టామినా చాటుతున్న సన్నీలియోన్ మహిళలకోసం ఫేస్ బుక్ లో ఓ వీడియో సందేశం ఉంచారు. పనివేళలో మహిళలకు ఎదురయ్యే వేధింపులు తెలియజేసేలా ఈ వీడియో ఉంది.

పనిచేసే చోట వేధింపులు తట్టుకోవడం చాలా కష్టమని తనకు తెలుసునని, అందువల్ల బాధ్యులను వదిలి పెట్టవద్దని సూచించారు. హర్రర్ విత్ కామెడీతో తెరకెక్కుతున్న 'కోకో కోలా' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఓ వైపు బుల్లితెర రియాల్టీ షోలతో బిజీగా ఉన్న ఈ భామ, మరోవైపు దక్షిణాదిలో తెరకెక్కుతున్న 'రంగీలా', వీరమదేవి' చిత్రాలు చేస్తున్నారు.

More Telugu News