ఫిల్టర్ కాఫీతో టైప్-2 డయాబెటిస్ దూరం!

22-12-2019 Sun 09:59
  • రోజుకు రెండు, మూడు కప్పులతో టైప్-2 డయాబెటిస్ దూరం
  • స్వీడన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
  • మధుమేహ నివారణలో ఫిల్టర్ కాఫీది విశేష పాత్ర

ఫిల్టర్ కాఫీతో టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది. స్వీడన్‌లోని చామర్స్ యూనివర్సిటీ, యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్‌ ముప్పును నివారించడంలో ఫిల్టర్ కాఫీ విశేషంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రోజులుగా ఫిల్టర్ చేసిన కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్-2 డయాబెటిస్ ముప్పు కొంత దూరమైనట్టు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహాన్ని నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చిందన్నారు. అయితే, వేడి చేసి తీసుకున్న కాఫీతో ఇలాంటి ఫలితం రాలేదన్నారు. రోజుకు రెండు, మూడు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 60 శాతం దూరమైనట్టు తమ పరిశోధనలో తేటతెల్లమైనట్టు వారు వివరించారు.