Milk: పాలకన్నా బీరే మిన్న: పెటా వినూత్న ప్రచారం!

  • డెయిరీ ఉత్పత్తులతో సైడ్ ఎఫెక్ట్స్
  • గుండె వ్యాధులు, ఒబేసిటీ ఖాయం
  • హార్వార్డ్ పరిశోధనలను ఉటంకించిన పెటా

ప్రతి రోజూ నిద్ర లేవగానే ఓ గ్లాసుడు పాలు తాగాలన్నది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఉగ్గుపాలతో నేర్పించే మాట. కానీ, జంతు సంరక్షణ సంస్థ (పెటా) మాత్రం, కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఆరోగ్యంగా ఉండాలంటే, నిత్యమూ గ్లాసు పాలు తాగడం కన్నా, పెగ్గు బీరు తాగితే మంచిదని చెబుతూ, ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు, పరిశోధనలు జరిపి, ఓ నివేదికను విడుదల చేశారని వెల్లడించింది.

పాలతో పోలిస్తే, బీర్ చాలా మంచిదని ఇందులో ఎటువంటి అనుమానాలూ వద్దని పెటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రేసీ రీమాన్స్‌ తెలిపారు. పాల ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే, గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, మధుమేహం, క్యాన్సర్‌ తదితర వ్యాధులు వస్తాయని ఆయన హెచ్చరించారు. పాల అధిక వాడకంతో ఎముకల వ్యాధి సోకే ప్రమాదముందని రుజువు చేస్తూ, కొన్ని రుజువులను కూడా ఆయన తన ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో బీరుతో ఎముకలు గట్టి పడతాయని అన్నారు.

More Telugu News