శబరిమలలో పెరిగిన రద్దీ.. స్వామి దర్శనానికి 8 గంటల సమయం

22-12-2019 Sun 06:27
  • కిక్కిరిసిపోతున్న శబరిగిరి
  • ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు నాలుగు గంటల సమయం
  • పంపానదిలో అడుగంటిపోతున్న నీరు

శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. భక్తులతో శబరిగిరి కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. నేడు స్వామివారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి 4 గంటలకు పైగా సమయం పడుతుండగా, రిజర్వేషన్ లేని సాధారణ భక్తులు స్వామి దర్శనం కోసం దాదాపు 8 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. పంపానదిలో నీరు అడుగంటిపోతుండడంతో భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఇబ్బంది పడుతున్నారు.