Tommorow Congress Dharna At Rajghat: రాజధానిలో రాజఘాట్ వద్ద రేపు కాంగ్రెస్ నిరసన

  • సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ ధర్నా
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన
  • సోనియా, రాహుల్ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొంటారని సమాచారం

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ధర్నా జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలంతా ఈ ధర్నాలో పాల్గొంటారని తెలిపాయి.

ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, తదితరులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ సైతం శుక్రవారం బీజేపీపై విమర్శలు సంధిస్తూ, విద్యార్థులు, పౌరులకు సంఘీభావం తెలిపారు. సీఏఏపై పార్టీకి అభ్యంతరాలున్నాయని, దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరిగే ఎలాంటి ప్రదర్శనలకైనా తమ మద్దతు ఉంటుందని ఓ వీడియో సందేశంలో సోనియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

More Telugu News