Sangareddy: సంగారెడ్డి ప్రజలకు నీళ్లు ఇస్తే హరీశ్ రావును సన్మానిస్తా... ఇవ్వకపోతే ఎప్పుడొచ్చినా అడ్డుకుంటా: జగ్గారెడ్డి

  • హరీశ్ రావుపై జగ్గారెడ్డి ధ్వజం
  • హరీశ్ వల్లే సంగారెడ్డికి నీటిఎద్దడి వచ్చిందని ఆరోపణ
  • టీఆర్ఎస్ నేతల్లో అహం పెరిగిందంటూ ఆగ్రహం

మంత్రి హరీశ్ రావు అనాలోచిత నిర్ణయం వల్లే సంగారెడ్డికి నీటి ఎద్దడి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఆరోపించారు. మల్లన్న సాగర్ వచ్చే వరకైనా సంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇప్పించాలని కోరారు. సంగారెడ్డి ప్రజలకు నీళ్లు ఇస్తే హరీశ్ రావును సన్మానిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. డిసెంబరు 31వ తేదీ లోపు గోదావరి నీళ్లు సంగారెడ్డికి ఇస్తామని హామీ ఇవ్వాలని, లేకుంటే జనవరి 2 తర్వాత హరీశ్ రావు సంగారెడ్డికి ఎప్పుడొచ్చినా అడ్డుకుంటానని హెచ్చరించారు. ఎన్నికల్లో తామే గెలుస్తున్నామన్న అహం టీఆర్ఎస్ నేతలకు పెరిగిందని, ఓటర్లంటే టీఆర్ఎస్ ఎంపీలకు భయం లేకుండా పోయిందని అన్నారు.

More Telugu News