GN Rao Committee: జీఎన్ రావు కమిటీకి ఏ అర్హత ఉందని వారి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవాలి?: సీపీఐ నారాయణ

  • గుంటూరులో సీపీఐ వార్షికోత్సవ సభ
  • హాజరైన నారాయణ
  • ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదని వ్యాఖ్యలు

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ రాజధాని అంశం గురించి సీపీఐ వార్షికోత్సవ సభలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, ఎంతో కష్టపడి సాధించుకున్న రాష్ట్రానికి రాజధాని కూడా ఓ అందమేనని, ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.

గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలని మొదటి నుంచి తాము కోరుతున్నామని అన్నారు. అసలు, రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీకి అర్హత ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. కమిటీకి ఏ అర్హత ఉందని వారి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవాలని నిలదీశారు. జీఎన్ రావు కమిటీ నివేదికను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఉండాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు.

More Telugu News