union Minister Nitn Gadkari: డ్రైవర్ల కొరత ఉంది.. డ్రైవర్ లెస్ కార్లను అనుమతించం: కేంద్రమంతి గడ్కరీ

  • ఉద్యోగాలు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్నికేంద్రం స్వాగతించదు
  • నేను రవాణామంత్రిగా ఉన్నంతకాలం అనుమతించను
  • క్యాబ్ కంపెనీలు డ్రెవర్ లెస్ కార్లను తీసుకొస్తే డ్రైవర్లు నిరుద్యోగులవుతారు

దేశంలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉందని.. డ్రైవర్ లేకుండా నడిచే కార్లను ఇప్పట్లో అనుమతించమని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించే ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ప్రభుత్వం స్వాగతించదన్నారు. నిన్న జరిగిన అసోచామ్ సదస్సులో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 25 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు. డ్రైవర్ లెస్ కార్ల గురించి నన్ను అడుగుతుంటారు. నేను రవాణామంత్రిగా ఉన్నంతకాలం వాటిని మరిచిపోవాల్సిందే. అలాంటి కార్లు భారత్ కు వచ్చేందుకు నేను అనుమతించను’ అని చెప్పారు.

దేశంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. క్యాబ్ సేవలందిస్తున్న ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో చాలామంది డ్రైవర్లుగా పనిచేస్తూ జీవిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ క్యాబ్ కంపెనీలు డ్రెవర్ లెస్ కార్లను తీసుకొస్తే.. అప్పటికే ఉపాధి పొందుతున్న డ్రైవర్లంతా నిరుద్యోగులుగా మారతారని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం డ్రైవర్ లెస్ కార్లను ప్రోత్సహించదని పేర్కొన్నారు.

More Telugu News