సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే ... చిత్రపటానికి పాలాభిషేకం!

21-12-2019 Sat 18:47
  • నేడు సీఎం జగన్ పుట్టినరోజు
  • వేడుకల్లో కేక్ కట్ చేసిన రాపాక
  • మోరి చేనేత సొసైటీ వద్ద క్షీరాభిషేకం

ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన సీటు ఒక్కటి. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ పార్టీకి పరువు దక్కింది. జనసేన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు దక్కించుకున్న రాపాక ఇటీవల వైసీపీకి దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా, ఆయన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు, జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరింత విస్మయానికి గురిచేశారు.

తన నియోజకవర్గంలో నిర్వహించిన సీఎం జగన్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న రాపాక కేక్ కూడా కట్ చేశారు. ఆపై మోరి చేనేత సొసైటీ వద్ద నిర్వహించిన మరో వేడుకకు సైతం హాజరయ్యారు. అక్కడ జగన్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.