Google: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కాసుల వర్షం!

  • గూగుల్ మాతృసంస్థకు కూడా సీఈఓగా వ్యవహరిస్తున్న పిచాయ్
  • ఏడాదికి రూ.14 కోట్లు జీతం
  • కంపెనీ లక్ష్యాలను అందుకుంటే నజరానాగా రూ.1400 కోట్లు!

టెక్ దిగ్గజం గూగుల్ కు సీఈఓగా సుందర్ పిచాయ్ అందిస్తున్న సేవలు యాజమాన్యాన్ని అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. దాని ప్రతిఫలమే ఇటీవలే సుందర్ పిచాయ్ ను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు కూడా సీఈఓగా నియమించారు. పారితోషికం కూడా భారీగా పెంచారు. వచ్చే ఏడాది నుంచి ఆయన ఏటా రూ.14 కోట్లు అందుకోనున్నారు. అంతేకాదు, గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల లక్ష్యాలను అందుకోగిలితే సుమారు రూ.1400 కోట్ల విలువైన కంపెనీ స్టాక్స్ ను నజరానాగా పొందుతారు. అందుకోసం, రాబోయే మూడేళ్లలో కంపెనీ లక్ష్యాలను సుందర్ పిచాయ్ సాధించి చూపాల్సి ఉంటుంది.

సుందర్ పై నజరానాల వెల్లువ ఇంతటితో ఆగలేదు. ఎస్ అండ్ పీ సూచికలో ఆల్ఫాబెట్ 100 మార్కును దాటిపోతే మరో రూ.640 కోట్ల విలువైన కంపెనీ స్టాక్స్ ఈ భారతీయుడి వశం కానున్నాయి. అయితే, గూగుల్ వర్గాల్లో సుందర్ పిచాయ్ పై వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు అంత మొత్తం చెల్లించడం దేనికని ఓ ఉన్నతోద్యోగి సంస్థ యాజమాన్యాన్ని నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం.

More Telugu News