ఈఎస్ఐ స్కాంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం... మరో ఇద్దరికి అరదండాలు

21-12-2019 Sat 16:15
  • సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం
  • మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
  • నకిలీ బిల్లులు క్లెయిమ్ చేసుకున్నట్టు గుర్తింపు

సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో  ఏసీబీ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ విశాల్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన పందిరి భూపాల్ రెడ్డి, వసుధ మార్కెటింగ్ ఏజెన్సీకి చెందిన నాగేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి, తేజా ఫార్మా కంపెనీ వర్గాలతో కుమ్మక్కైనట్టు గుర్తించారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఐఎంఎస్ నుంచి నకిలీ బిల్లులను క్లెయిమ్ చేసుకున్నట్టు తెలుసుకున్నారు.