జగన్ గతంలో రాజధానిగా అమరావతిని అంగీకరించారు: ధూళిపాళ్ల నరేంద్ర

21-12-2019 Sat 12:46
  • పార్టీల కోసం, మా కోసం కాదు.. రైతుల కోసమే ఈ ఉద్యమం
  • మా ప్రాంతాల్లోనూ రాజధానికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తాం
  • సీఎంలు మారొచ్చు కానీ ఒప్పందాలు మారకూడదు

గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సమర్థించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'పార్టీల కోసం, మా కోసం కాదు రైతుల కోసమే ఈ ఉద్యమం. మా ప్రాంతాల్లోనూ రాజధానికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తాం. సీఎంలు మారొచ్చు కానీ ఒప్పందాలు మారకూడదు. జగన్ గతంలో రాజధాని అమరావతిని అంగీకరించారు' అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిని మార్చుతామని జగన్ ప్రకటన చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.