Hebba Patel: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వెబ్ సీరీస్ లో నటిస్తున్న హెబ్బా పటేల్ 
  • మామగారితో అల్లుడి మరో సినిమా 
  • ఫిలిం ఫేర్ అవార్డుల హోస్టుగా సందీప్ కిషన్

*  ఈవేళ డిజిటల్ ప్రపంచంలోకి పలువురు తారలు ప్రవేశిస్తూ అక్కడ కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఆ కోవలోకి హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా చేరుతోంది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైం కోసం నిర్మించే వెబ్ సీరీస్ లో హెబ్బా పటేల్ నటిస్తోంది. ఇందులో నవదీప్ హీరోగా నటిస్తున్నాడు.

*  ఆమధ్య రజనీకాంత్ తో ఆయన అల్లుడు హీరో ధనుశ్ 'కాలా' చిత్రాన్ని నిర్మించిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ ఆయనతో మరో చిత్రాన్ని నిర్మించనున్నాడు. రజనీ నటించే 169వ చిత్రానికి ధనుశ్ నిర్మాతగా వ్యవహరిస్తాడట.
*  భారత సినీ ప్రపంచంలో ఫిలిం ఫేర్ పత్రిక ఇచ్చే అవార్డులకు ఓ ప్రత్యేకత వుంది. ఇక అందులో పాల్గొనడం కూడా ఓ చక్కని అనుభవంగా భావిస్తుంటారు. త్వరలో చెన్నైలో జరిగే ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా హాస్టులుగా వ్యవహరించనున్నారు.

More Telugu News