Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత అంతంతే: కేంద్ర మానవ వనరుల శాఖ

  • అక్షరాస్యతలో అగ్రస్థానంలో కేరళ
  • మహిళా అక్షరాస్యతలో అట్టడుగున రాజస్థాన్
  • ఏపీలో పురుషుల అక్షరాస్యత 69.38 శాతం మాత్రమే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత అంతంత మాత్రమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ఏడేళ్లు నిండిన వారి అక్షరాస్యతపై నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అవిభాజ్య ఏపీలో పురుషుల అక్షరాస్యత 69.38 శాతంగా ఉంటే మహిళల అక్షరాస్యత శాతం 51.54గా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.

అక్షరాస్యత విషయంలో దేశంలో పురుషులు 31వ స్థానంలో ఉండగా, మహిళలు మాత్రం 29వ స్థానంతో కొంత మెరుగ్గా ఉన్నారు. పురుషులు, మహిళల పరంగా చూస్తే.. దేశంలో పురుషుల అక్షరాస్యత శాతం 77.15 శాతం కాగా, మహిళలు 57.93 శాతంతో ఉన్నారు. మహిళా అక్షరాస్యతలో రాజస్థాన్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉండగా, అక్షరాస్యత విషయంలో కేరళ అగ్రస్థానంలో ఉంది.

More Telugu News