Jagan: గతంలో చంద్రబాబు ఇచ్చారు, ఇప్పుడు జగన్ ఇస్తున్నారు... తెలంగాణలోనూ అలాగే ఇవ్వాలి: ఎంపీ అరవింద్

  • పసుపు రైతుల కోసం సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఎంపీ అరవింద్
  • ఏపీలో మద్దతు ధర ఇస్తున్నారని వెల్లడి
  • త్వరగా ఆదుకోవాలని విజ్ఞప్తి

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి పసుపు రైతుల సమస్యలపై ఎలుగెత్తారు. తాను ఎంపీగా గెలిచాక రైతుల సమస్యలపై పోరాటం సాగిస్తున్న ఈ యువ ఎంపీ తాజాగా సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. పసుపుకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది పంట చేతికొచ్చే సమయం అని, త్వరితగతిన రైతులను ఆదుకోవాల్సిన తరుణం అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ఆదుకునే వ్యవస్థ ఇంతకుముందు నుంచే ఉందని, అప్పట్లో చంద్రబాబు ఇచ్చారని, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇస్తున్నారని తెలిపారు. జగన్, గతంలో చంద్రబాబు ఇచ్చిన తరహాలో తెలంగాణలోనూ పసుపు రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అంతేకాదు, గతంలో లేఖలను మనిషితో మీ వద్దకు పంపిస్తే వారిని లోపలికి అనుమతించ లేదని, అందుకే ఈ లేఖను కొరియర్ లో పంపుతున్నానని అరవింద్ వివరణ ఇచ్చారు.

More Telugu News