West Bengal: పార్లమెంటు చేసిన చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణా?: మమత తీరుపై గవర్నర్ జగదీప్ ఆగ్రహం

  • ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపాటు 
  • అంతర్గత వ్యవహారాల్లోకి బయట సంస్థలను ఎలా రాణిస్తారు?
  • భవిష్యత్తు పరిణామాలను ఆమె విస్మరించరాదు

పౌరసత్వ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరిపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి ప్రాతిపదిక పార్లమెంటు అని, అటువంటి పార్లమెంటు చేసిన చట్టంపై మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్గత వ్యవహారాల్లోకి బయట సంస్థల జోక్యాన్ని కోరడం ద్వారా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు మమత పూనుకున్నారని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన నాయకురాలిగా ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగించే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశభక్తి ఉన్న ఏ వ్యక్తి మమత తీరును అంగీకరించబోరన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News