Pakistan: పాకిస్థాన్ ను హెచ్చరించిన భారత్, అమెరికా

  • ఉగ్రవాద నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని సూచన
  • ఉగ్రవాద నిర్మూలనపై కలిసి పని చేయడానికి అంగీకరించిన భారత్-అమెరికా
  • వాషింగ్టన్ లో జరుగుతున్న చర్చల్లో ఇరు దేశాల అంగీకారం

ఉగ్రవాదానికి స్వర్గధామంలా మారిన పాకిస్థాన్ ను భారత్, అమెరికా హెచ్చరించాయి. ఉగ్రవాద నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పాయి. వాషింగ్టన్ లో జరుగుతున్న చర్చల్లో ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనపై కలిసి పని చేయడానికి అంగీకరించాయి. ఉగ్రవాదుల గుర్తింపునకు భారత చట్టాల్లో మార్పు చేయడాన్ని అమెరికా స్వాగతించింది.

మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అమెరికా పాత్రను భారత్ అభినందించింది. అమెరికా మంత్రులు మైక్ పాంపియో, మార్క్ ఎస్పర్ తో భారత కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, జైశంకర్ విస్తృత చర్చలు జరిపి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

More Telugu News