Crime News: 'మా అబ్బాయి విదేశాల్లో ఉంటే నీకు ఈ పిల్లాడెలా పుట్టాడు' అంటూ కోడలిని ఇంట్లోకి రానివ్వని అత్తామామలు!

  • తమిళనాడులో ఘటన
  • 9 నెలల పాటు పుట్టింట్లో ఉన్న మహిళ
  • అత్తింటికి వచ్చిన నేపథ్యంలో వేధింపులు

అబ్బాయి విదేశాల్లో ఉంటే పిల్లాడెలా పుట్టాడంటూ తమ కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా అత్తామామలు వేధిస్తున్న ఘటన తమిళనాడులోని తెన్‌కాశి సమీపంలోని కట్టేరిపట్టిలో చోటు చేసుకుంది. తొమ్మిది నెలల పాటు పుట్టింట్లో ఉన్న ఓ మహిళ ఇటీవల అత్తింటికి వచ్చింది. చేతిలో ఓ పిల్లాడిని ఎత్తుకొని కనపడింది. ఆ పిల్లాడు ఎవరని అత్తామామలు ప్రశ్నించారు. దీంతో 'మీ మనవడు' అని ఆమె అత్తామామలకు తెలిపింది. ఆ అత్తామామలు కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు.
 
దీంతో కోడలు తెన్‌మొళి అత్తింటి ముందే కూర్చొని నిరసన తెలుపుతోంది. తమ కుమారుడు మురుగన్ తో తెన్ మొళికి పెళ్లి జరిగి 9 నెలలు గడిచిందని, అయితే, తమ కుమారుడు పెళ్లి జరిగిన 20 రోజులకే విదేశాలకు వెళ్లాడని అత్తామామలు అంటున్నారు. మురుగన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో తెన్‌ మొళి తన తల్లిదండ్రుల వద్దే ఉందని అన్నారు. కావాలంటే పిల్లాడికి డీఎన్ ఏ పరీక్షలు చేయించాలని కోడలు ఆవేదనతో డిమాండ్ చేస్తోంది. 

More Telugu News