Chandrababu: టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం

  • నేను ఆత్మకూరుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు
  • ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ? 
  • పల్నాడు పులిలా ఉండే కోడెలను ఎన్నో రకాలుగా వేధించారు
  • చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు 

తాను ఆత్మకూరుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, తమ ఇంటి గేటుకు తాళ్లు కట్టారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తననే అడ్డుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ? అని ఆయన ప్రశ్నించారు. అనంతపురం టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

'అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన 40 మందిపై కేసులు పెట్టారు. పల్నాడు పులిలా   ఉండే కోడెలను ఎన్నో రకాలుగా వేధించారు. చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు. ఆత్మకూరులో 130 మందిని ఊరి నుంచి తరిమేశారు. టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.

'సీఐ భక్తవత్సలరెడ్డిపై ప్రైవేటు కేసు వేశాం. అట్రాసిటీ కేసులు పెట్టి టీడీపీ నేతలను బెదిరిస్తున్నారు. పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలి. వైసీపీ బాధితుల కోసం పునరావాస కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News