Kesineni Nani: మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్టపోతోందని దక్షిణాఫ్రికా వారు మొత్తుకుంటున్నారు: కేశినేని నాని

  • మూడు రాజధానుల యోచనపై కేశినేని విమర్శలు
  • దక్షిణాఫ్రికా నేతలు కూడా వద్దనుకుంటున్నారని వ్యాఖ్య
  • మన  ఏపీకి మూడు రాజధానులు ఎందుకు సీఎం గారూ? అని ప్రశ్న

దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయంటూ, మనమూ మారాల్సిన అవసరం ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటనపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు రాజధానులను రెండింటికి కుదించాలని దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకమ్ జుమా గతంలో ప్రకటించిన విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని జగన్ పై విమర్శలు గుప్పించారు.

'సౌత్ ఆఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్టపోతుందని మొత్తుకుంటుంటే మన ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు ముఖ్యమంత్రి గారూ?' అని కేశినేని నాని ప్రశ్నించారు. కాగా, ఏపీ పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, చట్టసభలతో ‘అమరావతి’ని రాజధానిగా చేయాలని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

More Telugu News