Andhra Pradesh: ఏపీలో శాసనమండలి రద్దు దిశగా అడుగులు?

  • కీలక బిల్లులకు శాసనసభలో ఆమోదం
  • వెనక్కి తిప్పి పంపిన శాసనమండలి
  • మండలిలో ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోవడమే కారణం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం, ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లులకు శాసనమండలిలో చుక్కెదురైంది. ఈ రెండు బిల్లులను శాసనసభకు తిప్పి పంపుతూ మండలి తీర్మానం చేసింది. దీంతో, మండలిలో ఈ బిల్లులకు ఆమోదం లభించనట్టైంది. ఈ నేపథ్యంలో, వచ్చే సమావేశాల్లో ఈ బిల్లులపై మరోసారి శాసనసభలో చర్చ జరపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా శాసనమండలి ఈ బిల్లులపై విభేదిస్తే... చివరకు శాసనసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది.

శాసనసభలో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. కానీ, మండలిలో మాత్రం విపక్షాల సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది. దీంతో, శాసనసభలో ఆమోదం పొందే బిల్లులకు... మండలిలో చుక్కెదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. శాసనమండలిని రద్దు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనేదే ఆ చర్చ సారాంశం. శాసనమండలిని నిర్వహించడం ఆర్థికంగా పెనుభారం అనే కారణంతో దాన్ని రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

More Telugu News