Adilabad District: ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సమత హత్యాచార కేసు విచారణ

  • గత నెల 24న సమతపై అత్యాచారం, హత్య
  • కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
  • నేడు నిందితులను విచారించనున్న కోర్టు

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో మరికాసేపట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ ముగ్దుంలను కోర్టు విచారించనుంది. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించనున్నారు.

జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపటార్‌లో గత 24న సమత హత్యాచారానికి గురైంది. బెలూన్లు అమ్ముకుని జీవించే సమత సాయంత్రం ఒంటరిగా ఇంటికి వస్తున్న సమయంలో అడ్డగించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సత్వర విచారణకు ఆదిలాబాద్ జిల్లా, అదనపు సెషన్స్ కోర్టును ఫాస్ట్ ‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేసింది. కాగా, నేటి విచారణ సందర్భంగా  సాక్షుల విచారణ షెడ్యూల్‌‌ను ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News