sweetener: స్వీటెనర్‌లను ఉపయోగిస్తున్నారా? అయితే.. మీకు టైప్-2 మధుమేహం రావొచ్చు!

  • దక్షిణ ఆస్ట్రేలియా వర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • బరువు పెరగడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి దుష్పరిణామాలు
  • బేకరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా స్వీటెనర్ల ఉపయోగం

లో కేలరీ కలిగిన కృత్రిమ చక్కెర (స్వీటెనర్)లను ఉపయోగించే వారికి టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్టు దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. పరిశోధనలో భాగంగా స్వీటెనర్‌ను ఉపయోగించే 5 వేల మంది ఆరోగ్య ఫలితాలను కొన్ని సంవత్సరాల పాటు విశ్లేషించిన అనంతరం అధ్యయనకారులు ఈ నిర్ణయానికి వచ్చారు. బేకరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఈ స్వీటెనర్లను వాడుతుంటారు.

స్వీటెనర్ల ప్రభావంతో శరీరంలోని హానిచేయని బ్యాక్టీరియా స్వరూప స్వభావాల్లో మార్పులు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రభావం టైప్-2 మధుమేహానికి దారి తీయడంతోపాటు అధిక బరువు ముప్పు కూడా ఉంటుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు, స్వీటెనర్‌కు అలవాటు పడిన వృద్ధుల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, గుండెపోటు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలినట్టు నిపుణులు తెలిపారు.

More Telugu News