Yami Goutham: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • అజిత్ సినిమాలో బాలీవుడ్ భామ 
  • పోస్ట్ ప్రొడక్షన్ లో మహేశ్ సినిమా 
  • బన్నీ, సుకుమార్ చిత్రం అప్ డేట్స్ 

   *  గతంలో కొన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతం తాజాగా అజిత్ సరసన ఛాన్స్ కొట్టేసింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో కథానాయికగా యామీగౌతం నటిస్తోంది.

*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 5న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తారు.
*  అల్లు అర్జున్ ఓపక్క 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని పూర్తిచేస్తూనే, మరోపక్క సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ కూడా ముగిసినట్టు సమాచారం.

More Telugu News