Imran khan: ఉరిశిక్ష పడిన ముషారఫ్‌కు మద్దతుగా పాక్ ప్రధాని ఇమ్రాన్!

  • ముషారఫ్ కు స్వదేశంలో పెరుగుతున్న మద్దతు
  • ఉరిశిక్షను వ్యతిరేకించిన సైన్యం
  • నాడు కేసుకు మద్దతు తెలిపి.. నేడు ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్న ఇమ్రాన్

దేశద్రోహం కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష పడిన పాకిస్థాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్‌కు స్వదేశంలో మద్దతు పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సైతం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో ముషారఫ్‌పై నమోదైన రాజద్రోహం కేసుకు మద్దతు తెలిపిన ఇమ్రాన్.. ఇప్పుడు ఉరిశిక్షను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఉరిశిక్షపై చర్చించేందుకు నిన్న పార్టీ కోర్ కమిటీతో సమావేశమైన ఇమ్రాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, ముషారఫ్‌కు ఆర్మీ కూడా మద్దతు తెలుపుతోంది. ముషారఫ్ ద్రోహి కాదని పేర్కొన్న సైన్యం.. కోర్టు తీర్పును ఖండిస్తున్నట్టు ప్రకటించింది. 

More Telugu News