Andhra Pradesh: రాజధాని ప్రాంత రైతులకు జనసేన భరోసాగా నిలుస్తుంది: పవన్ కల్యాణ్

  • ప్రభుత్వంపై నమ్మంకంతో తమ భూములను ఇచ్చారు
  • సీఎం వ్యాఖ్యలు భూములిచ్చిన రైతుల్లో ఆందోళన రేపుతున్నాయి
  • వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధానిపై అస్పష్ట ప్రకటనలు చేస్తోంది

ఏపీ రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతంలోని రైతులు ప్రభుత్వంపై నమ్మంకంతో తమ భూములను ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ఆ ప్రాంత రైతులకు జనసేన ఎల్లప్పుడూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధానిపై అస్పష్ట ప్రకటనలు చేస్తోందని స్పందించారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఓపికపట్టాలని పవన్ రైతులకు సూచించారు. కమిటీ పొందుపరిచిన అంశాల ఆధారంగా స్పందిద్దామని తన పార్టీ నేతలకు ఉద్బోధించారు.

సీఎం జగన్ వ్యాఖ్యలు రాజధానికోసం భూములిచ్చిన రైతుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. వారిలో మనోధైర్యం నింపడానికి తమ పార్టీ జనసేన ముందుకెళుతోందని చెప్పారు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నాయకులను రైతుల వద్దకు పంపిస్తున్నట్లు పవన్ తెలిపారు. నాదెండ్ల నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ఈ నెల 20న రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు అనుసరించాల్సిన కార్యచరణను ఈ బృందం రైతులతో చర్చిస్తుందన్నారు.

More Telugu News