TataGroup: టాటా గ్రూప్ చైర్మన్ గా తిరిగి మిస్త్రీని నియమించాలన్న అప్పిలేట్ ట్రైబ్యునల్

  • నాలుగు వారాల తర్వాత పునర్నియామక ఉత్తర్వులు  
  • ఈలోగా, టాటా సంస్థ అప్పీల్ కు దాఖలు చేసుకోవచ్చు
  • ఎన్. చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం

దాదాపు మూడేళ్ల క్రితం టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీని ఆ పదవి నుంచి తొలగించారు. దీనిపై న్యాయపోరాటం చేసిన మిస్త్రీ విజయం సాధించారు. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా తిరిగి మిస్త్రీనే నియమించాలని ముంబైలోని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్ క్లాట్) ఆదేశించింది.

మిస్త్రీ పునర్నియామక ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత అమల్లోకి వస్తాయని, ఈలోగా, టాటా సంస్థ అప్పీల్ కు దాఖలు చేసుకోవచ్చని ఎన్ క్లాట్ తెలిపింది. అదేసమయంలో, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎన్. చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని చెబుతూ నిలుపుదల చేసింది. కాగా, 2016 అక్టోబరు 24న మిస్త్రీని పదవి నుంచి తొలగించారు. అదే ఏడాది డిసెంబరు 19న టాటా గ్రూప్ కు చెందిన వివిధ సంస్థల డైరెక్టర్ గా ఆయన రాజీనామా చేశారు.

More Telugu News