muslim jamaath council: పౌరసత్వ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన అన్నా డీఎంకే రాజ్యసభ సభ్యుడిని బహిష్కరించిన ముస్లిం జమాత్ కౌన్సిల్!

  • జాన్‌ను బహిష్కరించిన ముస్లిం జమాత్ కౌన్సిల్
  • ఈ నెల 12 నుంచి చట్టంగా మారిన బిల్లు
  • మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం

పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో ఓటేసిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు మొహమ్మద్ జాన్‌పై బహిష్కరణ వేటు పడింది. ఆయనను ముస్లిం జమాత్ కౌన్సిల్ నుంచి బహిష్కరించినట్టు కౌన్సిల్ సభ్యులు ప్రకటించారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో ఈ నెల 12 నుంచి పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా, ఇవి ఢిల్లీకి కూడా పాకాయి.

More Telugu News