Sujana Chowdary: మా తాత బ్రిటీష్ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్: సుజనా

  • ఆమధ్య టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజనా
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • తన కుటుంబం గురించి వెల్లడి

ఆమధ్య టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు వెల్లడించారు. తన తల్లిదండ్రుల వివరాలను అభిమానులతో పంచుకున్నారు. తమది వ్యాపార కుటుంబం కాదని, తాతగారు బ్రిటీష్ పాలనలో పోలీసాఫీసర్ అని వెల్లడించారు. ఆయన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలితరం ఐపీఎస్ అధికారుల్లో ఒకరిగా నిలిచారని తెలిపారు.

తన పూర్వీకుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదమద్దాలి అని, తన తల్లి సుజన గారిది కంచికచర్ల వద్ద పున్నవరం గ్రామం అని సుజనా వివరించారు. తన తండ్రి జనార్దన్ నీటిపారుదల శాఖలో ఉద్యోగి అని, ఆయన రిటైరయ్యారని తెలిపారు. తమ పూర్వీకులు వ్యవసాయం చేసేవారని పేర్కొన్నారు. తన తల్లి సొంతూరు అయిన పున్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సుజనా వివరించారు. వాస్తవానికి తన అసలు పేరు సుజనా చౌదరి కాదని, తన పేరు సత్యనారాయణ చౌదరి అని వెల్లడించారు. సత్యనారాయణ చౌదరి అనేది తన తాతగారి పేరని తెలిపారు.

More Telugu News