capital: యువతకు భవిష్యత్ నిచ్చేలా రాజధాని ఉండాలి: అసెంబ్లీలో చంద్రబాబునాయుడు

  • రాజధాని అమరావతి భావి తరాలకు ‘ఆశ’గా ఉండాలి
  • ‘డ్రీమ్ క్యాపిటల్’ గా ఉండాలి
  •  రాజధాని అనేది సంపద సృష్టించాలి

రాజధాని అమరావతి భావి తరాలకు ‘ఆశ’గా, ‘డ్రీమ్ క్యాపిటల్’ గా ఉండాలని ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ ఇచ్చేలా, ఉపాధి కల్పించేలా ‘అమరావతి’ ఉండాలని.. రాజధాని అనేది సంపద సృష్టించాలని, లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదని సూచించారు.

అదేమాదిరి, పదమూడు జిల్లాల అభివృద్ధికి, ఆదాయ వనరు, నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఉద్యోగాల కల్పవల్లి, ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం ‘మన రాజధాని అమరావతి’ అని అన్నారు. ఆరోజున  అందరినీ సంప్రదించిన తర్వాతే ప్రజారాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని చెప్పారు. నాడు శివరామకృష్ణయ్య నివేదికను పట్టించుకోలేదని తమపై వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను ఖండించారు. పదమూడు జిల్లాలకు సెంటర్ లో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

More Telugu News